DSC 2024 Results: డీఎస్సీ ఫలితాలు విడుదల.. జిల్లాలో పోస్టుల వివరాలు ఇలా..

నిర్మల్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ–2024 ఫలితాలను సెప్టెంబ‌ర్ 30న‌ విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 342 పోస్టులు ఉన్నాయి.

జిల్లా కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ పాఠశాలలో అక్టోబర్ 1 నుంచి ఈ నెల 5 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ జరగనుంది. 1:3 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి సమాచారం అందించారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంఈవోలు, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో కూడిన 10 పరిశీలన బృందాలను ఈ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఏర్పాటు చేశారు.

చదవండి: DSC Merit Lists: జిల్లాలకు డీఎస్సీ మెరిట్‌ జాబితాలు.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది చొప్పున ఎంపిక

ఎంపికై న అభ్యర్థులకు 1:3 ప్రకారం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌కు ఇప్పటికే మెసేజ్‌ పంపించారు. అభ్యర్థుల జాబితాను deonirmal.weebly.com, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, సెయింట్‌ థామస్‌ పాఠశాలలో ప్రదర్శించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్‌ కాపీలు, గెజిటెడ్‌ అధికారిచే ధ్రువీకరణ చేయించిన 2 జతల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలని డీఈవో రవీందర్‌ రెడ్డి సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

డీఎస్సీకి ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్‌ ఫారం, డీఎస్సీ–2024 ఫలితాల జాబితా, టెట్‌ ఫలితాల జాబితాను తప్పకుండా జత చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వివిధ ప్రాధాన్యత కేటగిరీలకు చెందినవారు తమ కుల ధ్రువీకరణ పత్రం, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ ధ్రువీకరణ పత్రం, స్పోర్ట్స్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ ధ్రువీకరణ పత్రాలు, ఈ డబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను ఆయా రిజర్వేషన్ల అభ్యర్థులు తప్పకుండా తమ ఒరిజినల్‌ పత్రాలు సమర్పించి, ధ్రువీకరణ చేసుకోవాలని ఆయన సూచించారు.

జిల్లాలో పోస్టుల వివరాలు

ఎస్జీటీలు

236

ఎస్‌ఏలు

70

భాషోపాధ్యాయులు

04

పీఈటీలు

04

ఎస్జీటీలు( ప్రత్యేక ఉపాధ్యాయులు)

23

ఎస్‌ఏలు (ప్రత్యేక ఉపాధ్యాయులు)

05

మొత్తం

342

#Tags