CIPET 2024: సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌–2024.. కోర్సుల వివరాలు ఇవే..

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీఐపీఈటీ) దేశవ్యాప్తంగా ఉన్న సిపెట్‌ కేంద్రాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌–2024 నిర్వహించనుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ–మూడేళ్ల వ్యవధి.
డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ–మూడేళ్ల వ్యవధి.
పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రొసెషన్‌–టెస్టింగ్‌–రెండేళ్ల వ్యవధి.
పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ –క్యాడ్‌/క్యామ్‌–ఏడాదిన్నరేళ్ల వ్యవధి.

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.
పరీక్షతేది: 09.06.2024.
కోర్సు ప్రారంభం: 2024 ఆగస్ట్‌ మొదటి వారం

వెబ్‌సైట్‌: https://cipet24.onlineregistrationform.org/

చదవండి: AP PGCET 2024 Notification: ఏపీ పీజీసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. సీబీటీ విధానంలో పరీక్ష

#Tags