Skip to main content

Admissions in CITD Hyderabad: సీఐటీడీ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Diploma Courses Admission Notice  Apply Now   Admissions in Diploma Courses in CITD Hyderabad  Admission Announcement Diploma Courses 2024-25

కోర్సులు వివరాలు
డిప్లొమా ఇన్‌ టూల్, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం)–60 సీట్లు
డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(డీఈసీఈ)–60 సీట్లు.
డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌(డీఏఆర్‌ఈ)–60 సీట్లు.
డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌(డీపీఈ)–60 సీట్లు
.
కోర్సు వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు మూడేళ్లు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20.05.2024 నాటికి 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
ప్రవేశ పరీక్ష తేది: 26.05.2024
పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/diploma-admissions-2024.php

చదవండి: PhD Admission in NISER: NISERలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Published date : 10 Apr 2024 12:40PM

Photo Stories