Pankaj Advani: బిలియర్డ్స్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌ అద్వానీ

భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌) దిగ్గజం పంకజ్‌ అద్వానీ తన విజయవంతమైన కెరీర్‌లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. 

చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్‌ మ్యూజియంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాను పొందుపరిచారు. గత నవంబర్లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌గా 26వ టైటిల్‌ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్‌ ఫార్మాట్, ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌ విభాగాల్లో టైటిళ్లున్నాయి. 

Team India Rankings: వన్డే, టి20, టెస్టులోనూ టీమిండియానే నెంబర్‌వ‌న్‌!!

#Tags