Aman Sehrawat : రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి మెడల్‌.. ఇదే తొలి మ్యాచ్ కూడా..

భారత యువ రెజ్లర్ అమన్‌ సెహ్రావత్‌ దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ఫోగాట్‌ పసిడి పతక ఆశలు ఆవిరైన వేళ తాను ఉన్నానంటూ యువ రెజ్లర్ అమన్‌ సెహ్రావత్‌ కాంస్య పతక పోరులో బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. పూర్టోరికో రెజ్లర్‌ క్రజ్‌ డెరియన్‌కు చుక్కలు చూపిస్తూ వరుస రౌండ్లలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Paris Olympics: ఒలింపిక్స్‌ విజేతలకు నగదు బహుమతులు.. ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలుసా..?

అతి పిన్న వయసులో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావతే కావడం గమనార్హం. అంతేకాదు, ఇదే త‌న మొద‌టి ఒలంపిక్స్ కావ‌డం కూడా విశేష‌మే.
 

#Tags