Womens Asian Champions Trophy: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్

భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

న‌వంబ‌ర్ 20వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ ర్యాంకింగ్స్ 5వ స్థానంలో ఉన్న చైనా జట్టుతో జరిగిన తుది పోరులో భారత జట్టు 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది.

గతంలో భారత జట్టు 2016, 2023లలో ఈ టైటిల్‌ను దక్కించుకుంది. దక్షిణ కొరియా తర్వాత వరుసగా రెండుసార్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. జపాన్ జట్టుకు మూడో స్థానం లభించింది. 

ATP Finals: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్ విజేత యానిక్‌ సినెర్‌.. ప్రైజ్‌మనీ ఎంతంటే..

భారత జట్టుకు నగదు..
విజేతగా నిలిచిన భారత జట్టుకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ.10 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు రూ.10 లక్షలు, ఇతర సహాయక సిబ్బందికి రూ.5 లక్షల చొప్పున అందజేస్తామన్నారు.

  • ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపిక ఏడు మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. 
  • ఈ టోర్నీలో నమోదైన మొత్తం గోల్స్ 86. 
  • ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా 9 మంది క్రీడా కారిణులు (దీపిక, సంగీత, ప్రీతి దూబే, నవనీత్ కౌర్, లాల్‌రెమ్ సియామి, మనీషా చౌహాన్, బ్యూటీ డుంగ్‌డుంగ్. సలీమా టెటె, ఉదిత) గోల్స్ చేశారు.

Magnus Carlsen: టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా బ్లిట్జ్‌ టోర్నమెంట్ విజేత మాగ్నస్‌ కార్ల్‌సన్‌

#Tags