AP Cabinet Highlights: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే... సీపీఎస్ స్థానంలో నూత‌న పెన్ష‌న్‌

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధ‌వారం జ‌రిగిన భేటీలో మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.
AP Cabinet Meeting

ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు-2023’ పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

చ‌ద‌వండి: డిప్లొమా, డిగ్రీ అర్హ‌త‌తో రైల్వేలో ఉద్యోగాలు... రాత ప‌రీక్ష లేకుండానే నియామ‌కం... పూర్తి వివ‌రాలు ఇవే

మరోవైపు రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది.

చ‌ద‌వండి: ఎలాంటి ప‌రీక్ష లేదు... జ‌స్ట్ ప‌దో త‌ర‌గ‌తి మార్కుల‌తోనే రైల్వేలో ఖాళీల భర్తీ

జగనన్న అమ్మ ఒడి పథకం అమలును జూన్ 28 తేదీకి వాయిదా వేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ.6,888 కోట్లను వ్యయం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్‌ఎస్ఎల్‌కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో... ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి

జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాల నిర్వాహణకు, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే చెప్ప‌డంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో దాదాపు 10 వేల మందికి ల‌బ్ధి చేకూర‌నుంది. 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

#Tags