AP Mega DSC Notification 2024: మెగా డీఎస్సీ జోష్
Sakshi Education
విశాఖ విద్య: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
విద్యాశాఖ వర్గాలు, నిరుద్యోగ అభ్యర్థుల్లో బుధవారం దీనిపై సర్వత్రా చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ వస్తోందని నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. వీటిలో క్యాడర్ వారీగా ఎన్ని ఉన్నాయనే దానిపై అభ్యర్థులు ఆరా తీశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన నియామకాల ప్రక్రియ ఉండటంతో ఉపాధ్యాయ కొలువు దక్కించుకునేందుకు అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమశాఖ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీలో ఖాళీలను గుర్తించారు.
Published date : 02 Feb 2024 09:04AM
Tags
- AP Mega DSC Notification 2024
- ap dsc notification 2024
- CM YS Jaganmohan Reddy
- AP Cabinet
- Unemployed Youth
- Education News
- andhra pradesh news
- Anganwadi Jobs in andhra pradesh
- andhra pradesh dsc notification 2024
- Government approval
- Teacher Recruitment
- job opportunities
- Employment News
- sakshi education latest jobs notifications
- latest jobs in 2024