Preeti Sudan: యూపీఎస్సీ సభ్యురాలిగా ప్రీతి సూదన్

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సభ్యురాలిగా ప్రీతి సూదన్‌ బాధ్యతలు చేపట్టారు.

ఆమె 1983 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని ప్రీతీ సూద‌న్‌తో ప్ర‌మాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసిన ఆమె 2020 జులైలో పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ప్రపంచ బ్యాంకు సలహాదారుగా ప‌నిచేశారు. కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాలు, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శిగానూ సేవలందించారు.

☛ లా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి

#Tags