Australia's new PM: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్‌

Telugu Current Affairs - Persons: ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌ బాధ్యతలు చేప్టటారు. మే 23న ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్‌బెర్రాలో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రధానిగా ఆంటోనీ ప్రమాణ స్వీకారం చేశారు.

మే 21న పార్లమెంటు ఎన్నికల విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆంటోనీ మాట్లాడుతూ.. వాతావరణం మార్పుల ద్వారా వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికే తాను పెద్ద పీట వేస్తానన్నారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 43 శాతం తగ్గిస్తానని, సోలార్‌ విద్యుత్, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?

GK International Quiz: ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అల్-అక్సా మసీదు ఏ దేశంలో ఉంది?

కన్జర్వేటివ్‌ పాలనకు తెర..
ఆంటోనీ అల్బనీస్‌ నూతన ప్రధానిగా ప్రమాణం చేయడంతో.. ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి పరిపాలనకు తెరçపడినట్లయింది. తాజా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు ప్రధానిగా స్కాట్‌ మారిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి కంటే లేబర్‌ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది.

Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​
GK National Quiz: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
ఎప్పుడు : మే 23
ఎవరు    : లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌
ఎక్కడ    : కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా
ఎందుకు : తాజా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించినందున..

Prime Minister of France: ఫ్రాన్స్‌ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?

Daily Current Affairs in Telugu: 2022, మే 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags