Cyclone Remal: దూసుకొస్తున్న 'రెమాల్' తుపాను.. ఇక్క‌డ భారీ వర్షాలు కురిసే అవకాశం!

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘రెమాల్‌’ ఉధృతంగా మారి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది.

ఈ తుపాను ధాటికి పశ్చిమబెంగాల్‌ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్‌ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది.

తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని మే 26వ తేదీ యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను ఎఫెక్ట్‌తో కోల్‌కతాలో పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.  

పోలీసులు, ఫైర్‌ సిబ్బందితోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్‌తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది.  

Mumbai Weather: ముంబైలో బీభత్సం సృష్టించిన గాలివాన

బంగ్లాదేశ్‌లో..
బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్‌ హెచ్చరికను, కోక్స్‌ బజార్, చిట్టోగ్రామ్‌లలో 9వ నంబర్‌ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఈ నెల 31వ తేదీలోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపు­లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందన్నారు.

Indian Population: భారత్‌లో తగ్గుతున్న హిందూ జనాభా.. ఎంత తగ్గిందంటే..

#Tags