CEC and EC Bill 2023: సీఈసీ, ఈసీల బిల్లు-2023కు రాజ్యసభ ఆమోదం

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
Rajya Sabha Passes Bill On Appointment Of CEC, EC

 ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలను రూపొందించే బిల్లు-2023ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిల్లును తెచ్చామని న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘ్వాల్‌ చెప్పారు. ‘‘1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవు.

Articl 370: ఆర్టికల్ 370 రద్దును స‌మ‌ర్ధించిన‌ సుప్రీంకోర్టు

తాజా బిల్లులో వాటిని పొందుపరిచాం. సీఈసీ, ఈసీ  నియామకాలను ఇప్పటిదాకా ప్రభుత్వమే చేపట్టేది. ఇకపై వాటిని ప్రత్యేక కమిటీ చూసుకుంటుంది. వారి వేతనాలు తదితరాలను బిల్లులో పొందుపరిచాం. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణలను కల్పించాం’అని వివరించారు.

Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్‌ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ

#Tags