Poverty In India: భారత్‌లో 5 శాతం మేర తగ్గిన‌ పేదరికం!!

భారతదేశంలో పేదరికం తగ్గినట్టు నీతి ఆయోగ్ స‌ర్వే తెలిపింది.

దేశంలో పేదరికం ఐదు మేర తగ్గిందని నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనావేసినట్లు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం..గ్రామీణ, పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5 పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5% మేర పెరిగి రూ.3,510కి చేరుకుంది.

Amrit Bharat Stations: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే..

అయితే గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42% పెరుగుదలలో రూ.2,008కి చేరుకుంది. ఈ డేటాల ఆధరాంగా దేశంలో పేదరికం 5% లేదా అంతకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది. ఆహార వ్యయం పరంగా గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50% కంటే తక్కువ ఆహారం కేటాయించినట్లు సర్వే తెలిపింది. అలాగే పట్టణ గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91% నుంచి 2022-23 నాటికి 71% తగ్గిందని సర్వే పేర్కొంది. అయితే ఆహారంలో పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినయోగం పెరుగుతోందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందిన నీతి అయోగ్‌ సీఈవో బీవీర్‌ సుబ్రహ్మణ్య అన్నారు.

Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి రానున్న‌ కొత్త క్రిమినల్​ చట్టాలు

#Tags