Centre for Monitoring Indian Economy: దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం?
నిరుద్యోగిత రేటు 2022 ఏడాది ఏప్రిల్‌లో 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. దేశీయంగా డిమాండ్ తగ్గుదల, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉద్యోగావకాశాలను దెబ్బతీశాయంది. ‘‘నిరుద్యోగిత హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం, రాజస్తాన్‌లో 28.8 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో 2022, మార్చిలో 8.28 శాతం నుంచి ఏప్రిల్‌లో 9.222 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 7.29 శాతం నుంచి 7.18 శాతానికి తగ్గింది’’ అని తెలిపింది.
Semicon India Conference 2022: సెమికాన్ ఇండియా తొలి సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?
ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ చేయనున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మే 2న రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో 2022, అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్(ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం నిరుద్యోగిత ఉంది
ఎప్పుడు : మే 02
ఎవరు : సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ)
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : దేశీయంగా డిమాండ్ తగ్గుదల, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉద్యోగావకాశాలను దెబ్బతీయడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్