Semicon India Conference 2022: సెమికాన్ ఇండియా తొలి సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?
కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఏప్రిల్ 29న ‘సెమికాన్ ఇండియా–2022’ సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫనెన్స్ ద్వారా మాట్లాడారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్లర్లు అవసరమన్నారు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు.
GK Persons Quiz: రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్ ఇండియా తొలి సదస్సును ఏప్రిల్ 29–మే 1 మధ్య బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.National Language: దేశ జనాభాలో ఎంత శాతం మందికి హిందీ మాతృభాష?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెమికాన్ ఇండియా–2022 తొలి సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్