G-20 Summit: G20 ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారో తెలుసా!

1994 మెక్సికన్ పెసో సంక్షోభం... 1999 ఆసియా ఆర్థిక సంక్షోభం తరువాత, క్లిష్టమైన ప్రపంచ అర్థిక సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నంలో G20 స్థాపించబడింది.
G-20 Summit

1999లో జరిగిన  G7 సమావేశంలో G20 ఫోరమ్ ఏర్పాటు చేశారు. G20 అనేది ప్ర‌పంచ అర్థిక వ్యవ‌స్థ‌కు సంబంధించిన ప్ర‌ణాలిక‌ల‌ను చ‌ర్చించే వేదిక‌. ‘ఫైనాన్షియల్‌ మార్కెట్లు– ప్రపంచ ఆర్థికవ్యవస్థ’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగింది.  G20 ప్రపంచ జనాభాలో 65%, ప్రపంచ వాణిజ్యంలో 75%, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన 85% మరియు ప్రపంచవ్యాప్తంగా 79% కార్బన్ ఉద్గారాలను కలిగి ఉన్న అనేక దేశాలను కలిగి ఉంది.

G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు

G20లో 19 దేశాలు ఉన్నాయి – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ - యూరోపియన్ యూనియన్‌తో పాటు. స్పెయిన్ శాశ్వత అతిథిగా ఆహ్వానించబడింది.

ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక ఆతిధ్య దేశం G20 స‌మావేశాల‌ను నిర్వ‌ర్తించే భాధ్య‌త‌ల‌ను తీసుకొంటుంది. 2022 G20 స‌మావేశం ఇండోనేషియ‌లోని బాలీలో జ‌రిగింది. 2023 G20 స‌మావేశం భార‌త్‌లోని ఢిల్లీలో సెప్టెంబ‌ర్ 9, 10వ తేదిల‌లో  జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో సుస్థిరాభివృద్ధిపై చ‌ర్చించ‌నున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన వసుధైవ కుటుంబకం (ఒక వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత) నినాదమే 2023 G20  సదస్సుకు మూలమంత్రంగా నిలవనుంది.

G20 Summit: G20 ల‌క్షాలేంటి?

రెండు రోజులు.. మూడు సెషన్లు

తొలి రోజు ఇలా...

► ప్రతి దేశాధినేతకూ భారత్‌మండపం వద్ద మన సంప్రదాయ రీతుల మధ్య ఘన స్వాగతం లభించనుంది.
► ఒకే వసుధ (వన్‌ ఎర్త్‌) పేరుతో తొలి సెషన్‌ శనివారం ఉదయం 9కి మొదలవుతుంది.
► దానికి కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార, అనధికార భేటీలుంటాయి.
► అనంతరం ఒకే కుటుంబం (వన్‌ ఫ్యామిలీ) పేరుతో రెండో సెషన్‌ మొదలవుతుంది.

రెండో రోజు ఇలా...  

► సదస్సు రెండో రోజు ఆదివారం కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి.
► దేశాధినేతలంతా ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. గాందీజీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
► అనంతరం భారత్‌ మండపం వేదిక వద్ద మొక్కలు నాటుతారు. పర్యావరణ పరిరక్షణకు పునరంకితం అవుతామని ప్రతినబూనుతారు.    
► ఒకే భవిత (వన్‌ ఫ్యూచర్‌) పేరిట జరిగే మూడో సెషన్‌తో సదస్సు ముగుస్తుంది.
► జీ20 అధ్యక్ష బాధ్యతలను వచ్చే ఏడాది శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌కు అప్పగించడంతో సదస్సు లాంఛనంగా ముగుస్తుంది.

G-20 Summit: విశ్వ శ్రేయస్సుకు జి–20

ఈసారి ఇతివృత్తమేంటి ?

వసుధైక కుటుంబం అనేది ఈ ఏడాదికి జీ20 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబం జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం.
భూమిపై మనగడ సాగిస్తున్న జీవజాలం మధ్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సహాహారమే వసుధైక కుటుంబం అని చాటిచెపుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్‌(లైఫ్‌ స్టైల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌).. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సు ద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు అభిలషిస్తోంది. ‘లైఫ్‌’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది.

India@2047: 2047 నాటికి అభివృద్ధి భారత్‌

#Tags