International Nowruz Day: నౌరూజ్‌ దినోత్సవం అంటే ఏంటి? ఎవరెవరు జరుపుకుంటారు?

International Nowruz Day

పర్షియాలో నూతన సంవత్సరం(నౌరూజ్‌) మొదలైంది. నౌరూజ్‌ అంటే పర్షియాలో కొత్త ఏడాది అని అర్థం. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి 21న నౌరూజ్‌ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో చైత్రమాసం తొలి రోజును ఉగాదిగా ఎలా జరుపుకుంటామో, అక్కడి ప్రజలు కూడా నౌరూజ్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.

నౌరూజ్‌.. చరిత్ర ఇదే
వసంతకాలం మొదటి రోజును నౌరూజ్‌గా జరుపుకుంటారు. సుమారు 3వేళ ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఈ పండగను ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరానియన్లు జరుపుకుంటారు.ఇది ఇరానియన్ క్యాలెండర్‌లో మొదటి నెల (ఫర్వార్డిన్) మొదటి రోజు. 2010లో, ఐక్యరాజ్యసమితి మార్చి 21ని అంతర్జాతీయ నౌరూజ్ దినోత్సవంగా ప్రకటించింది.

నౌరూజ్‌ అంటే వసంతకాలం మొదటి రోజు, ప్రకృతి పునరుద్ధరణను సూచించే పూర్వీకుల పండుగ అని అర్థం. ఈ రోజున అక్కడి ప్రజలు ఎంతో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. సుమారు 13 రోజుల పాటు నౌరూజ్‌ వేడుకలను కొనసాగిస్తారు. బంధువలు, స్నేహితులకు బహుమతులు ఇచ్చుకొని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. 
 

#Tags