International Day For Eradication Of Poverty: అక్టోబర్ 17వ తేదీ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవ‌త్స‌రం అక్టోబర్ 17వ తేదీ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకై తీసుకోవల్సిన చర్యల‌పై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17వ తేదీ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది.

ఈ ఏడాది థీమ్.. "సామాజిక మరియు సంస్థాగత దుర్భాషణ ముగింపు: న్యాయమైన, శాంతియుత, సర్వసమావేశమైన సమాజాల కోసం కలిసి పని చేయడం". ఇది పేదరికాన్ని కొనసాగించే వ్యవస్థాగత అసమానతలపై పోరాటానికి కేంద్రీకృతమైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడంలో చర్యలు తీసుకోవాలని ఇది సూచిస్తుంది. 

ఈ దినోత్స‌వ నేపథ్యం ఇదే..
ఫ్రెంచ్‌ మతాధికారి, మానవతవాది అయిన జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్‌లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల సమస్యల దేశాధినేతలకు అర్ధమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్‌ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వాక్యాలను చెక్కించారు.

World Food Day: అక్టోబర్ 16న‌ ప్రపంచ ఆహార దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం నాలుగు సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్‌ 22 ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచదేశాలన్ని ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక  తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి పేదల కోసం ఆహర్నిసలు కృషి చేసిన జోసెఫ్ వ్రెసిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. 

#Tags