Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 10, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 10th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Tiger Population: దేశంలో పెరుగుతున్న పులుల సంఖ్య.. తాజా లెక్కలివే..  
ప్రపంచంలోనే పులుల సంరక్షణ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారాయి. నాలుగేళ్లకొకసారి అభయారణ్యాలలో పులుల్ని లెక్కించే ప్రక్రియ ఆసక్తికరంగా మారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది.  
మన దేశంలో పులుల సంరక్షణ కోసం 50 ఏళ్ల క్రితమే టైగర్‌ ప్రాజెక్టు మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతకి పులులు ఎంత ముఖ్యమో గ్రహించిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం  1973, ఏప్రిల్‌ 1న ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. అ­ప్పట్లో దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో పులులు చేరిపోయాయి. ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య లక్ష ఉంటే, మన దేశంలో 40 వేలు ఉండేవి. అలాంటిది 1970 నాటికి పులుల సంఖ్య దాదాపుగా 1,800కు ప­డిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. అభివృద్ధి పేరిట అడవులకి, వన్యప్రాణులకి ఎంత నష్టం జరుగుతోందో గ్రహించి టైగర్‌ ప్రాజెక్టుని ప్రారంభించింది. తొలిదశలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్‌ రిజర్వ్‌లు ఉండేవి. ప్రస్తుతం 75 వేల చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4%) విస్తీర్ణంలో 53కి పైగా టైగర్‌ రిజర్వులున్నాయి. ప్రపంచంలో మొత్తం పులుల్లో మన దేశంలో 70% ఉన్నాయంటే ఈ టైగర్‌ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తోంది.  

Pan-Aadhaar Link: మీ ఆధార్-పాన్ లింక్ అయ్యిందా.. లేదా.. తెలుసుకోండిలా.. లింక్ చేయ‌క‌పోతే ఏమ‌వుతుందో తెలుసా..?
పులుల సంఖ్య పెరుగుతోందిలా..! 

2006 – 1,411 
2010 – 1,706 
2014 – 2,226 
2018 – 2,967 
2022 – 3,167 
పులులను ఎలా లెక్కిస్తారంటే! 
దేశంలో పులుల సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటి గణన చేపట్టినప్పుడు అదో పెద్ద సవాల్‌గా నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో తొలినాళ్లలో అటవీ సిబ్బంది అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి వన్యప్రాణులు కనిపిస్తే వాటి గుర్తులతో సహా ఎన్ని కనిపించాయో వివరాలను రాసుకొని లెక్కించేవారు.   పూర్తి వివ‌రాలకు ఇక్క‌డ క్లిక్ చేయండి


Project Tiger: ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’కు 50 ఏళ్లు.. 

దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు టైగర్ ఏర్పాటై ఇప్ప‌టికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ 18, 278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్య‌లో 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి.ప్రాజెక్టు టైగర్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పర్యటించారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్‌ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. అనంత‌రం పులుల గణన డేటాను విడుద‌ల చేశారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
అమృత్‌ కాల్‌ కా టైగర్‌ విజన్ బుక్‌లెట్ విడుదల
ఈ సంద‌ర్భంగా మైసూరులోని కర్ణాటక స్టేట్‌ ఓపెన్‌ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ‘ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలియెన్స్‌(ఐబీసీఏ)’ ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘అమృత్‌ కాల్‌ కా టైగర్‌ విజన్‌’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘పులుల సంరక్షణ ద్వారా భారత్‌ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు.

Female Cheetah Sasha: ఆడ చీతా సాషా మృతి

CRPF Recruitment Test: ప్రాంతీయ భాషల్లోనూ సీఆర్‌పీఎఫ్‌ పరీక్ష 
సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌లో కంప్యూటర్‌ టెస్ట్‌ను తమిళంలో నిర్వహించకపోవడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యతిరేకించారు. హిందీ, ఇంగ్లిష్‌ల్లోనే నిర్వహించడం సరికాదన్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయన లేఖ రాశారు. ‘‘పైగా 100 మార్కుల్లో హిందీ ప్రాథమిక పరిజ్ఞానానికి 25 మార్కులను కేటాయించడం వల్ల హిందీ మాట్లాడే అభ్యర్థులకే లబ్ధి కలిగింది. చర్య అభ్యర్థుల రాజ్యాంగ హక్కుకు భంగం కలిగించడమే. వీటిని నివారించేందుకు హిందీయేతర భాషలు మాట్లాడే వారి కోసం తమిళం సహా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష చేపట్టేలా చర్యలు తీసుకోండి’’ అని కోరారు.

Weekly Current Affairs (National) Bitbank: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?

Orleans Masters: ఓర్లియాన్‌ మాస్టర్స్‌ టోర్నీ విజేత ప్రియాన్షు 
భారత బ్యాడ్మింటన్‌ యువతార, ప్రపంచ 58వ ర్యాంకర్‌ ప్రియాన్షు రజావత్‌ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించాడు. ఏప్రిల్ 9న‌ ఫ్రాన్స్‌లో ముగిసిన ఓర్లియాన్‌ మాస్టర్స్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 21–15, 19–21, 21–16తో ప్రపంచ 49వ ర్యాంకర్‌ మాగ్నుస్‌ జొహాన్సన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు. ప్రియాన్షుకు 18,000 డాలర్ల (రూ.14 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

Asian Wrestling Championships 2023: రజతం నెగ్గిన భారత రెజ్లర్‌ రూపిన్‌
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఏప్రిల్ 9వ తేదీ భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో రూపిన్‌ (55 కేజీలు) రజతం.. నీరజ్‌ (63 కేజీలు), సునీల్‌ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్‌ 1–3తో సౌలత్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిపోగా.. నీరజ్‌ 5–2తో జిన్‌సెయుబ్‌ సాంగ్‌ (దక్షిణ కొరియా)పై, సునీల్‌ 4–1తో మసాటో సుమి (జపాన్‌)పై గెలిచారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

President Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్ర‌యాణించిన రాష్ట్రపతి ముర్ము 
భారత రాష్ట్రపతి, రక్షణ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 8వ తేదీ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అస్సాంలోని తేజ్‌పూర్‌ భారత వైమానిక దళ స్థావరం నుంచి సుఖోయ్‌–30ఎంకేఐ రకం విమానంలో ఆమె ప్రయాణం అరగంటసేపు సాగింది. 106వ స్క్వాడ్రన్‌ కమాండింగ్‌ ఆఫీసర్, గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ ఆ విమానాన్ని నడిపారు. ఫ్లయింగ్‌ సూట్‌ ధరించిన రాష్ట్రపతి విమానం ఎక్కబోయే ముందుగా హంగార్‌ వద్ద వేచి ఉన్న జర్నలిస్టుల వైపు చేతులు ఊపారు. కాక్‌పిట్‌లో కూర్చున్న రాష్ట్రపతికి మహిళా అధికారి ఒకరు హెల్మెట్‌ తొడిగి, అవసరమైన సాంకేతికపరమైన ఇతర జాగ్రత్తలు పూర్తి చేశారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
విమానం సముద్రమట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో బ్రహ్మపుత్ర లోయమీదుగా ప్రయాణించింది. ప్రయాణం చాలా మంచిగా సాగిందని అనంతరం ఆమె మీడియాతో అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనంటూ చైనా వివాదం సృష్టిస్తున్న సమయంలో సరిహద్దు రాష్ట్రం అస్సాంలో ఆమె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముర్ము ఈ ఏడాది మార్చిలో దేశయంగా తయారైన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారని రాష్ట్రపతి భవన్‌ గుర్తు చేసింది. 

Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు

Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1,260 కోట్ల టర్మినల్ ప్రారంభం 
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్‌ టర్మినల్‌ భవంతి(ఫేజ్‌–1)ను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్‌పోర్ట్‌ నూతన టర్మినల్‌ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. 

Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ల‌క్ష్య‌మిదే..
అలాగే ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. అనంత‌రం మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్‌ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు.  

IT: ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఉద్యోగాలు తొల‌గింత‌... ఐటీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ఉద్యోగులు

ITF: రన్నరప్‌గా తీర్థ శశాంక్‌ – సాయికార్తీక్‌ జోడి  
ఐటీఎఫ్‌ (అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య) వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ – ఎం15 పురుషుల టోర్నీ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన గంటా సాయికార్తీక్‌ రెడ్డి – మాచర్ల తీర్థ శశాంక్‌ రన్నరప్‌గా నిలిచింది. చెన్నైలో ఏప్రిల్ 8న జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మూడో సీడ్‌ మూడో సీడ్‌ విష్ణు వర్ధన్‌ – నితిన్‌ కుమార్‌ సిన్హా ద్వయం చేతిలో సాయికార్తీక్‌ – తీర్థ శశాంక్‌ ఓటమిపాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో విష్ణు – నితిన్‌ 6–1, 6–7 (2/7), 10–7 స్కోరుతో సూపర్‌ టైబ్రేక్‌లో విజయం సాధించారు.    

Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?

#Tags