Skip to main content

Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ మార్చి 29న‌ షెడ్యూల్‌ విడుదల చేశారు.
Karnataka Assembly elections

కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను మరింత పెంచేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తోంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు(ఓట్‌ ఫ్రమ్‌ హోం) సదుపాయం కల్పించ‌నున్న‌ట్లు ఈసీ స్పష్టం చేసింది. 
ఓటర్ల వివ‌రాలు..
కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానం. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 12.15 లక్షలు ఉంది.   41,312 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్‌ స్థానాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కర్నాటకలో 58,282 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. మార్చి 29 నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. 

ఎన్నికల షెడ్యూలిదే.. 
► ఏప్రిల్‌ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌.
► అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు ఏప్రిల్‌ 20 చివరి తేదీ. 
► ఏప్రిల్‌ 21న నామినేషన్ల పరిశీలన. 
► ఏప్రిల్‌ 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ. 
► మే 10న పోలింగ్‌.. 13న ఓట్ల లెక్కింపు. 

 

Published date : 29 Mar 2023 01:23PM

Photo Stories