Good News: వీఆర్‌వోల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌మోష‌న్ల‌కు మార్గం సుగ‌మం

గ్రేడ్‌–2 వీఆర్వోలకు ప్రభుత్వం ప్రమోషన్‌ చానల్‌ కల్పించింది. ఈ మేరకు ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిప్రకారం గ్రేడ్‌–2 వీఆర్వోలకు ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది.
Andhra Pradesh Government

ఈ మేరకు గ్రేడ్‌–2 నుంచి గ్రేడ్‌–1గా ప్రమోషన్‌ చానల్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌–166 ప్రతిని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజుకు గురువారం అందజేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు దేవరాజు, గోపాలకృష్ణ, ఆరుమళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: ఆ ఐదు యూనివ‌ర్సిటీలు హాట్ ఫేవ‌రెట్‌... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్‌

చ‌ద‌వండి: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ల‌క్ష్య‌మిదే..

#Tags