Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే...

2023 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల పూర్తి వివ‌రాలు మీ కోసం.
Nobel Prize 2023 Winners List

నోబెల్ బహుమతులు-2023 

1. వైద్య శాస్త్రం - 2 అక్టోబర్ 2023 - కాటలిన్‌ కరికో(హంగేరీ), డ్రూ వెయిస్‌మన్‌( అమెరికా) - న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్‌, వెయిస్‌మన్‌కు నోబెల్

2. భౌతిక శాస్త్రం - 3 అక్టోబర్ 2023 - పెర్రీ అగోస్తిని(అమెరికా), ఫెరెన్స్‌ క్రౌజ్‌(జర్మనీ), అన్నె ఎల్‌ హ్యులియర్‌(స్వీడన్‌) - ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వ‌రించిన‌ నోబెల్

3. రసాయన శాస్త్రం- 4 అక్టోబర్ 2023 - మౌంగి జి. బావెండి(అమెరికా), లూయిస్ ఇ. బ్రస్(అమెరికా), అలెక్సీ ఐ. ఎకిమోవ్‌(అమెరికా) - నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో  చేసిన పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

Nobel Prize in Chemisty 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ గ్ర‌హీత‌లు వీరే...

4. సాహిత్యం - 5 అక్టోబర్ 2023 - జాన్‌ ఫోసె(నార్వే) - మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్‌ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని నోబెల్‌ పురస్కారాన్ని ప్ర‌క‌టించారు.

Nobel Prize 2023 in Literature: సాహిత్యంలో జాన్‌ ఫోసెకు నోబెల్

5. శాంతి -  6 అక్టోబర్ 2023 - న‌ర్గిస్‌ మొహమ్మది (ఇరాన్‌ ) - ఇరాన్‌ మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది. 

Nobel Peace Prize 2023: న‌ర్గిస్‌కు నోబెల్ శాంతి పురస్కారం

6. ఆర్థిక శాస్త్రం - 9 అక్టోబర్ 2023 - క్లాడియా గోల్డిన్‌(అమెరికా) - లేబర్‌ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది.  

Nobel Prize 2023 in Economic Sciences: యు.ఎస్‌ లేబర్ ఎకనామిస్ట్‌కు ఆర్థిక శాస్త్రాంలో నోబెల్‌

#Tags