Medical Students Graduation Day: ఘనంగా వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం వేడుక

ఐదు సంవత్సరాల విద్య తరువాత వైద్య వృత్తిలో అడుగు పెట్టబోతున్న విద్యార్థులకు యూనివర్సిటీ వారికి స్నాతకోత్సవం వేడుకలు బుధవారం జరిపారు. ఈ వేడుకలో భాగంగా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌, కళాశాల యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..

 

అనంతపురం మెడికల్‌: ఎంతో గౌరవప్రదమైన వైద్య వృత్తిలో అడుగుపెడుతున్న వారందరూ ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సీటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ పిలుపునిచ్చారు.

TSPSC: గ్రూప్‌–1, 2, 3 పరీక్షల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

అనంతపురం వైద్య కళాశాల 2018 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం బుధవారం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ఘనంగా జరిగింది. డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యరావు, ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రణాళికతోనే రాణింపు

స్నాతకోత్సవం వేడుకలో భాగంగా యూనివర్సిటీ వీసీ బాబ్జీ మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగినప్పుడే వైద్య వృత్తిలో రాణింపు ఉంటుందన్నారు. ఫలితాలపై నిరుత్సాహం చెందకుండా ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సాహించారు. ఆస్పత్రుల్లో ఉండే రోగులనే ప్రథమ గురువులుగా భావించాలన్నారు.

Free Coaching for Group Exams: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో గ్రూప్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

రోగుల సమస్యను ఓపికగా తెలుసుకుని, పరిష్కారం చూపించే క్రమంలో చేస్తున్న ప్రతి చికిత్స ఓ పరిశోధన కావాలన్నారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఏర్పాటైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ రకాల రోగులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడితో ఆగిపోకుండా వైద్య రంగంలో నిరంతర పరిశోధనలు సాగించాలని వైద్య విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, ప్రొఫెసర్లు, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు ఆయన సూచించారు.

Indian Coast Guard Recruitment 2024: తీరదళంలో కమాండెంట్‌ కొలువులు.. పరీక్ష ఇలా..

తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే స్థాయికి ఎదగాలి

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యరావు మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ఉన్నతికి పాటుపడిన తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే స్థాయికి ఎదగాలని నూతనంగా వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారికి సూచించారు. నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకుని అందులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... యూజీ, పీజీ సీట్ల పెంపుతో పాటు నూతన కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారు పీజీ సీటు దక్కించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నారు.

NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 110 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అనంతరం ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వంద మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్‌ బాబ్జీను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ షారోన్‌, డాక్టర్‌ నవీన్‌కుమార్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌బేగం, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ యండ్లూరి ప్రభాకర్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

CPPRI Recruitment 2024: సీపీపీఆర్‌ఐలో సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

#Tags