High Court about Medical Counselling: మెడిక‌ల్ సీటు కౌన్సిలింగ్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన విద్యార్థి

నీట్ ప‌రీక్ష త‌రువాత కేఇఏకు ద‌ర‌ఖాస్తులు చేసినా కౌన్సిలింగుకు పిల‌వ‌క‌పోవ‌డంతో విద్యార్థి హైకోర్టును ఆశ్ర‌యించాడు. కార‌ణాలు తెలుసుకున్నాక కోర్టు ఇచ్చిన ఆదేశం...
NEET student to high court on medical counselling complaint

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలుగు మాతృభాష గల విద్యార్థికి అల్పసంఖ్యాకుల కోటాలో మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు పరిగణించాలని మంగళవారం కర్ణాటక పరీక్షా ప్రాధికార (కేఈఏ) కు హైకోర్టు సూచించింది. మైనారిటీ కోటాలో పరిగణించలేదంటూ చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి నివాసి అనిరుధ్‌ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. జడ్జిలు జస్టిస్‌ జీ.నరేందర్‌, విజయకుమార్‌ ఏ.పాటిల్‌లు విచారణ జరిపారు.

MPHEO Transfers: వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌పై ఆరోప‌ణ‌లు... కార‌ణం?

మాతృభాష తెలుగు కావడంతో భాషా మైనారిటీలు అనే కోటా కింద కౌన్సెలింగ్‌కు పిలవకపోవడం సరైన చర్య కాదని న్యాయపీఠం అభిప్రాయపడింది. మొదటి రౌండ్‌లో అవకాశమివ్వలేదని, రెండో రౌండ్‌లో పరిగణించాలని జడ్జిలు ఆదేశించారు. అనిరుధ్‌ 2023లో నీట్‌ పరీక్ష రాసి ఆ ర్యాంక్‌ ఆధారంగా కేఇఏకు దరఖాస్తు చేసినా కౌన్సెలింగ్‌కు పిలవలేదు. ఇదేమిటని అడిగితే నీ దరఖాస్తులో దోషాలు ఉన్నాయని జవాబిచ్చారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.
 

#Tags