MPHEO Transfers: వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆరోపణలు... కారణం?
సాక్షి ఎడ్యుకేషన్: ఎంపీహెచ్‌ఈవో బదిలీల్లో గందరగోళం జరిగింది. మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అనర్హులను అందలం ఎక్కించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులతో పాటు మొత్తం 14 మంది సిబ్బంది కోసం రీఫిక్సింగ్(సర్దుబాటు) కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం గత కొద్ది రోజుల నుంచి చేపడుతోంది. వివిధ పోస్టులకు సంబంధించి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. మంగళవారం జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 18 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
Internship and Job offer: ట్రిపులైటీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తోపాటు ఉద్యోగం
ఈ ప్రక్రియలో వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, ఉన్నతాధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన బదిలీల్లో తమ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు.
Student Success: కళాశాల నుంచి యూనివర్సిటీలోకి సీటు సాధించిన విద్యార్థిని
కొంత మంది ఎంపీహెచ్‌ఈవోలు సైతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులను కలిసి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. అలాగే డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కౌన్సెలింగ్ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఉమాసుందరికి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామారెడ్డి షోకాజ్ నోటీసు జారీచేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
నిబంధనలకు పాతర?
జీవో 143 ప్రకారం ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం గత నెల 26వ తేదీన ఎంపీహెచ్‌ఈవోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 6 జిల్లాల నుంచి 74 మందిని ఆహ్వానించారు. వీరిలో 18 మంది కౌన్సెలింగ్‌లో వచ్చిన పోస్టును తిరస్కరించారు.
UG Subjects: యూజీలో మేజర్ సబ్జెక్టుకు ప్రధాన ఎంపిక అమలు
వీరి కోసం మంగళవారం తిరిగి వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ డాక్టర్ ఎన్.ఉమాసుందరి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఈ కౌన్సెలింగ్‌లో అధికారులు నిబంధనలు పక్కన పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులకు ముగ్గురికి పోస్టింగులు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఒకరు టీఎన్‌టీయూసీకి చెందిన నాయకుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Gold Medal in Medical Exams: వైద్య పరీక్షల్లో బంగారు పతకం సాధించిన యువతి
ఇద్దరికి విశాఖలోను, ఒకరికి అనకాపల్లిలో పోస్టింగ్ కల్పించారు. నిబంధనల ప్రకారం బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించామని వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ డాక్టర్ ఉమాసుందరి తెలిపారు. దీనిలో పలు అసోసియేషన్లు వినతులు అందజేయగా, వాటిని తిరస్కరించామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది ఉండాలన్న నిబంధన ప్రకారం బదిలీ చేశామని చెబుతున్నారు.