Medical College: నంద్యాలలో ఎంబీబీఎస్‌ చేసే అవకాశం.. రూ.475 కోట్లతో వైద్య కళాశాల

నంద్యాల టౌన్‌: వైద్య విద్య డిమాండ్‌కు తగినట్టుగా రాష్ట్రంలో వైద్య కళాశాలలు లేకపోవటంతో ఎంబీబీఎస్‌ చదివేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.

అయితే అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్‌–లోకల్‌గా పరిగణిస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థులకు ఊరట కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దూరదష్టితో ఆలోచించి ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య తరగతులు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుండటంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు లభించడంతో పాటు పరోక్షంగా, ప్రత్యేక్షంగా వందల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. జాతీయ మెడికల్‌ కమిషన్‌ అనుమతులతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రారంభించి, 2023–24 విద్యా సంవత్సర అడ్మిషన్లు చేపట్టారు. దీంతో ఏటా కొత్తగా 150 మంది ఎంబీబీఎస్‌ చేసే అవకాశం కల్పించగా వీరిలో నంద్యాల జిల్లాకు చెందిన 17 మంది విద్యార్ధులు కళాశాలలో సీటు సాధించగలిగారు. వీరంతా అన్ని వసతులతో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. 

వైద్యవిద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ సంకల్పానికి నంద్యాల కళాశాల నిర్మాణానికి కొందరు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. కోర్డుకు వెళ్లి కళాశాల నిర్మాణంపై స్టే తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాల ఏర్పాటు కొంతకాలం సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వం పక్షాన నిలిచి రాష్ట్ర ప్రజలు, విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణం చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేయటంతో ప్రభుత్వం పై బురద జల్లుదామనే వారి ఆటకట్టించినట్లైంది.

Certificate Courses: వ్యవసాయ విద్యకు సర్టిఫికెట్‌ కోర్సులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

50.93 ఎకరాల విస్తీర్ణంలో..
నంద్యాల మెడికల్‌ కళాశాల భవనం, బోధనాసుపత్రి భవనాలను ప్రభుత్వం 50.93 ఎకరాల్లో 11.84 లక్షల చదరపు అడుగులలో నిర్మించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.475 కోట్ల నిధులను కేటాయించింది. ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అన్ని అధునాత వసతులు కల్పించేలా జీ ప్లస్‌ 3 ఫ్లోర్లతో భవనాన్ని నిర్మించారు. ఇందులో 3 మ్యూజియమ్స్‌, 8 టీచింగ్‌ గదులు, 8 లేబోరేటరీలు, 2 ఎగ్జామినేషన్‌ హాళ్లు, 4 లెక్చరర్‌ హాళ్లు ఉన్నాయి. 

రెసిడెన్షియల్‌, యూజీ హాస్టళ్లు, స్టాఫ్‌ అకామిడేషన్‌, వర్కింగ్‌ స్టాఫ్‌, నర్సెస్‌ రూమ్స్‌, గెస్ట్‌ హౌస్‌, స్టూడెంట్‌ నర్సెస్‌ హాస్టళ్లు, నర్సింగ్‌ కాలేజీ భవనం ఉంటుంది. హాస్టల్లో డైనింగ్‌ హాల్‌, సెంట్రల్‌ కిచెన్‌, లాండ్రీ, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌, బయోమెడికల్‌ వేస్ట్‌ రూమ్‌ ఏర్పాటయ్యాయి. పూర్తి స్థాయి విద్యార్థులతో మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులు విజయవంతంగా సాగుతున్నాయి.

చరిత్రలో నిలిచిపోయేలా..
కాలంతో పోటీ పడి ఏడాది సమయంలోనే కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి నంద్యాల వాసుల కలలు నిజం చేస్తు చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గత ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీన నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభమైంది. 

AP ITI Admission 2024: ఐటీఐ చదువుతుండగానే జాబ్‌ ట్రైనింగ్‌.. ఈ కోర్సు పూర్తయితే ఉద్యోగం సులువే..!

వైద్యం, వైద్య విద్య పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసున్న విధానాలు చూసి ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా ప్రయత్నం చేసి కళాశాల నిర్మాణంలో ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించినా స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అహర్నిశలు శ్రమించి అధికారులతో మమేకమై నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు.

#Tags