Degree Admissions: ఈనెల 18 నుంచి డిగ్రీ క‌ళాశాల‌ల్లో అడ్మిష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం..

ఇచ్ఛాపురం: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రబీన్‌కుమార్‌ పాడి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని, ఈ మేరకు సంబంధిత కరపత్రాలను శుక్రవారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ విడుదల చేశారు. కాలేజీల్లో ప్రవేశం కోసం ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులంతా బీకాం, బీఏ, బీఎస్సీ గ్రూప్‌లలో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Govt Degree College Admissions: ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

 

#Tags