Education News: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పురస్కారం

Education News: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పురస్కారం

విజయవాడ :  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు 2022–23 విద్యా సంవత్సరానికి గాను ఐఎస్‌టీఈ (ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) పురస్కారం లభించింది. కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ ప్రభుత్వ పాలిటె క్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.విజయసారథి, అధ్యాపకుడు కె.విజయభాస్కర్‌ హాజరై ఐఎస్‌టీఈ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సిన్హా కాకాసాహెబ్‌ దేశాయ్‌, అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ హెచ్‌.సుదర్శన్‌రావు నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి గాను సాంకేతిక అంశాల్లో వివిధ సెమినార్లు, సాంకేతిక అంశాల్లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేసినందుకు ఈ పురస్కారం లభించిందని ప్రిన్సిపాల్‌ విజయసారథి చెప్పారు. ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:  నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌–3 పరీక్షలు.. 1,363 పోస్ట్‌లకు 5 లక్షలకుపైగా పోటీ!

#Tags