AU Degree and PG Distance Education Application 2024 : దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దూరవిద్య విధానంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆంధ్ర యూనివర్సిటీ.

2024-25 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

పీజీ కోర్సుల వివ‌రాలు ఇవే..
☛ ఎంబీఏ (హెచ్‌ఆర్‌ఎం/ ఫైనాన్స్/ మార్కెటింగ్): 4 సెమిస్టర్లు
☛ ఎంసీఏ: 4 సెమిస్టర్లు
☛ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(ఇంగ్లిష్ మీడియం): 
రెండేళ్ల వ్యవధి. 
నాలుగు సెమిస్టర్లు.
☛ ఎంఏ (హిందీ/ తెలుగు/ ఇంగ్లిష్/ ఎకనామిక్స్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ హిస్టరీ/ జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్/ ఫిలాసఫీ/ పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సోషియాలజీ)
☛ ఎంఎస్సీ (సైకాలజీ/ మ్యాథ్స్‌/ బోటనీ/ ఫిజిక్స్/ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ జువాలజీ)
☛ ఎంకాం
☛ పీజీ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

☛ Dr.B.R. Ambedkar Open University Admissions 2024-25 : అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. అర్హ‌త‌లు ఇవే..

యూజీ కోర్సుల పూర్తి వివ‌రాలు ఇవే..
☛ బీఏ, బీకాం (ఇంగ్లిష్/ తెలుగు మీడియం)

☛  బీఎస్సీ (ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, ఎంపీసీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, సీబీజడ్‌.
☛ యూజీ కోర్సులకు ఇంటర్మీడియట్/ 10+2 అర్హత ఉండాలి. 
☛ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ : మూడేళ్ల వ్యవధి ఉంటుంది. ఆరు సెమిస్టర్లు ఉంటాయి.

ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags