Dr Jayaraj: చదువుకు పేదరికం అడ్డుకాదు.. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థినులు..

నెహ్రూసెంటర్‌: చదువుకు పేదరికం అడ్డుకాదని, పట్టుదలతో విద్యనభ్యసిస్తే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని ప్రజాకవి డాక్టర్‌ జయరాజ్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలోని గుమ్మూనూర్‌కు చెందిన దళిత విద్యార్థినులు ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ ఏప్రిల్ 14న‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థినులు విద్యకు పేదరికం అడ్డుకాదని నిరూపించారని కొనియాడారు.

చదువుపై ఆంక్షలు విధించినా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఉన్నత విద్యను చదివి స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుర్తు చేశారు. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలాలు అందిపుచ్చుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలు విద్యా, విజ్ఞానం, ఆర్ధికంగా ఎదగాలని సూచించారు.

చదవండి: KGBV Inter Student: కేజీబీవీ ఇంటర్‌ విద్యార్థినికి ఎంఈఓ అభినందనలు..

ఎంబీబీఎస్‌ పట్టాలు పొందిన పెరుమాళ్ల అనిత, సోమారపు గాయత్రి, గులగట్టు ప్రియర్ష, చింతల అనితను ఘనంగా సన్మానించారు.

సీపీఎం మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సూర్నపు సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ డోలి సత్యనారాయణ, కవయిత్రి తాళ్లపల్లి యాకమ్మ, పార్నంది రామయ్య, చీపిరి యాకయ్య, సూర్నపు ముత్తయ్య, రావుల రాజు, నాయిని కుమార్‌, చాగంటి భాగ్యమ్మ, సూర్నపు సావిత్రి, కూనపూరి నీలేష్‌రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ‘Sakshi’ ఆధ్వర్యంలో EAPCET, NEET విద్యార్థులకు మాక్‌టెస్టులు

#Tags