District Employment Officer: వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
వర్ధన్నపేట: ఎస్సీ, ఎస్టీ యువతీయువకులు వృత్తి నైపుణ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మాధవి అన్నారు.
ఫిబ్రవరి 21న వర్ధన్నపేట పట్టణంలోని ఎంఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
సదస్సులో పాల్గొన్న యు వతీయువకులకు ఒక్కొక్కరికి బ్యాగు, సర్టిఫికెట్‌ను అందచేశారు. కార్యక్రమంలో జేఎస్ ఎస్ డైరెక్టర్ ఖాజా మసీదున్, ఏపీసీసీ ప్రతినిధులు నసీర్, సిద్దికి, కోటేష్, జిల్లా కో ఆర్డినేటర్ రహమాన్, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, కొండేటి అనిత సత్యం తదితరులు పాల్గొన్నారు.
#Tags