National Career Service centre: మెగా జాబ్‌మేళా
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) ఫర్ ఎస్సీ, ఎస్టీ ఆధ్వర్యంలో మే 26వ తేదీన ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం విద్యానగర్‌లోని ఎన్‌సీఎస్‌సీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సబ్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ భూక్యా కాసిమ్ మే 24న ఒక ప్రకటనలో తెలిపారు.
విప్రో, టెక్‌మహీంద్రా తదితర పది రకాల కంపెనీల్లో దాదాపు 645 ఉద్యోగాలకు మే 26వ తేదీన మెగా జాబ్‌మేళా ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ncs.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040–27408555 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
12,828 Postal Jobs : పది పాసైతే చాలు.. పోస్టల్‌లో ఉద్యోగం.. పూర్తి వివరాలు ఇవే..
#Tags