High Court: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటా చెల్లదు

చండీగఢ్: హరియాణా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ప్రైవేట్ రం గంలోని ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని న‌వంబ‌ర్‌ 17న‌ పంజాబ్ చండీగఢ్ హైకోర్టు కొట్టివేసింది.

'హరియాణా స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోక్ క్యాండిడేట్స్ యాక్ట్, 2020 రాజ్యాం విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19లకు వ్యతిరేకం. అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇది చెల్లుబాటుకాదు' అని జస్టిస్ థావలియా, జస్టిస్ హర్ ప్రీత్ కౌర్ జీవన్ ధర్మాసనం పేర్కొన్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది అక్షయ్ భాన్ చెప్పారు.

చదవండి: Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఆ భాగాన్ని కొట్టేయలేం

హరియాణా ప్రభుత్వం చేసిన చట్టం 2022 జనవరి 15 నుంచి అమలవుతోంది. పది మంది లేదా అం తకంటే సిబ్బంది పనిచేసే ప్రైవేట్ సంస్థలకు ఇది వర్తిస్తుంది. నెలకు గరిష్టంగా రూ.30 వేల వేతనం పొందే ఉద్యోగాలకు దీనిని వర్తిం పజేసింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పారిశ్రామిక సంఘాలతోపాటు ఫరీదాబాద్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కోర్టులో పిటిషన్లు వేశాయి.

#Tags