Faculty Jobs: జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ జానియర్‌ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పలు సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు.
జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

జనరల్‌ విభాగంలో 36 పోస్టులు హిందీ–1, ఆంగ్లం–4, గణిత శాస్త్రం–6, వృక్షశాస్త్రం–6, జంతుశాస్త్రం–5, భౌతిక శాస్త్రం–4, రసాయనశాస్త్రం–2, అర్థశాస్త్రం–3, అర్థ శాస్త్రం (ఉర్దూ)–2, రాజనీతి శాస్త్రం–1, రాజనీతి శాస్త్రం(ఉర్దూ)–2 ఉన్నాయన్నారు. వృత్తివిద్యా విభాగంలో 06 పోస్టులు టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌01, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్‌ (ఓఏ) టైప్‌ షార్ట్‌ హ్యాండ్‌–2, కంప్యూటర్‌ సైన్స్‌–1, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌–1, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌–1 ఉన్నాయని తెలిపారు.

చదవండి: Telangana Govt Jobs: కేజీబీవీల్లో 1241 పోస్టులు.. పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు ఇవే..

అర్హత గలవారు తమ దరఖాస్తులను జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కార్యాలయంలో ఈ నెల 24 సాయంత్రం 5గంటల్లోగా అందజేయాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం ఆపైన మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

చదవండి: 12,828 India Post Jobs: పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags