Free Training: బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌పై ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌ రూరల్‌: బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌పై ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ కల్పన కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మార్చి 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ ఉత్తీర్ణులైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండు నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

చదవండి: DSC Free Training: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

26 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన బీసీ అభ్యర్థులు మార్చి 15 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 31న ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 08732–221280 నంబరులో సంప్రదించాలని సూచించారు.

చదవండి: Free Training In Computer Courses: కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్న హార్వర్డ్‌ యూనివర్సిటీ

#Tags