396 Jobs: భవిత రీసోర్స్‌ పర్సన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం భవిత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్‌ పర్సన్‌ (ఐఈఆర్‌పీ) పోస్ట్‌ల భర్తీకి అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 18వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ కె.శామ్యూల్‌ సెప్టెంబ‌ర్ 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
భవిత రీసోర్స్‌ పర్సన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

 రాష్ట్రవ్యాప్తంగా భవిత కేంద్రాలలో ఖాళీగా ఉన్న 396 పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఈమేరకు ప్రకటన విడుదల చేశారని తెలిపారు. అర్హత గల అభ్యర్థులను తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు పనిచేసేందుకు ఎంపిక చేయనున్నట్టు వివరించారు. పల్నాడుజిల్లా పరిధిలోని 28 భవిత పాఠశాలల్లో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

చదవండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్..

జిల్లాలోని ఖాళీలు, విద్యార్హత వివరాలను www.apie.apcfss.in వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల మెరిట్‌ జాబితాపై సందేహాలను గుంటూరు సమగ్ర శిక్ష కార్యాలయంలో నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

చదవండి: Jobs in APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ, నెల్లూరు జోన్‌లో 300 ఉద్యోగాలు .. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

#Tags