IITH: వెంట్రుకలో వెయ్యో వంతునూ చూడొచ్చు!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫిక్‌ సాధనాల తయారీ సంస్థ ‘నికాన్‌’.. దేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్‌డ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీస్‌తో కూడిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను ఐఐటీ హైదరాబాద్‌లో న‌వంబ‌ర్‌ 25న ప్రారంభించింది.

కణం మొదలు కణజాలం వరకు జీవ వ్యవస్థలకు సంబంధించిన విభిన్న పరిశోధనల్లో దోహదపడేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఒక వెంట్రుకలో కేవలం వెయ్యో వంతులో ఉండే సూక్ష్మ పదార్థాన్ని కూడా పరిశీలించే సామర్థ్యం ఇందులోని హై రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ పరికరాలకు ఉందని.. కేన్సర్‌ కణాలపై పరిశోధనలతోపాటు స్కానింగ్‌ ప్రక్రియలకు సంబంధించిన పరిశోధనలకు ఈ కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు.

చదవండి: Photography & Short Film Competitions: ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు ఆహ్వానం

ఈ కేంద్రంలో ఏఎక్స్‌ఆర్‌ పాయింట్‌ స్కానింగ్‌ కాన్ఫోకల్‌ వ్యవస్థతోపాటు ఎన్‌–స్పార్క్‌ సూపర్‌ రిజల్యూషన్, టీఐఆర్‌ఎఫ్‌ వంటి ఇమేజింగ్‌ సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శౌర్యదత్తగుప్తా తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఫ్లోరొసెన్స్‌ ఇమేజింగ్‌ కోసం నికాన్‌ ఇన్వర్టడ్‌ మైక్రోస్కోప్‌ టీఐ–2ఈ ఉందన్నారు. అలాగే ఇన్వర్టెడ్‌ టిష్యూ కల్చర్‌ మైక్రోస్కోప్‌ నికాన్‌ టీఎస్‌2ఎఫ్‌ఎల్, మాక్రో ఇమేజింగ్‌ కోసం నికాన్‌ ఎస్‌ఎంజెడ్‌ 800 ఫ్లోరొసెన్స్‌ అటాచ్‌మెంట్‌ సదుపాయం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో నికాన్‌ ఇండియా ఎండీ సజ్జన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

#Tags