Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత

పటాన్‌చెరు టౌన్‌: విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యపడుతుందని కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యాదగిరి అభిప్రాయపడ్డారు.

ఫిబ్ర‌వ‌రి 16న‌ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మల్బార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ను 232 మంది విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగదు ఉపకార వేతనాలు భవిష్యత్‌ అవసరాల నిమిత్తం వాడుకోవాలని సూచించారు.

చదవండి: Great Scholarship: బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2024'

సభకు అధ్యక్షత వహించిన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌, మల్బార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి దీపక్‌ కుమార్‌ మాట్లాడుతూ, మహిళల ఆర్థికాభివృద్ధి వారి విద్యార్హతపైనే ఆధారపడుతుందన్నారు. తారా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ రత్న ప్రసాద్‌, రాధిక, పద్మజ, డాక్టర్‌ యోగి బాబు, సురేష్‌, శ్రీనివాసరావు, డాక్టర్‌ బగ్గు, రవీందర్‌, వీరేందర్‌, సరిత, విశ్వ భారతి, డాక్టర్‌ పూనమ్‌ కుమారి, అశ్వినీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Tags