RPO Jonnalagadda Snehaja: సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రహసనమేమీ కాదు.. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఇవి కీలకం..
సాంకేతికంగా అటెస్టేషన్, అపోస్టిల్‌గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనం అనే భావన అనేకమందిలో ఉంది. ఈ కారణంగానే ఏజెంట్లను ఆశ్రయించి అధిక మొత్తం చెల్లించడమో, ఢిల్లీ వరకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవడమో జరుగుతోంది. అయితే.. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అదీనంలో ఉన్న బ్రాంచ్ సెక్రటేరియట్ ఈ ప్రక్రియల్ని చేపడుతుందని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ (ఆర్‌పిఓ) జొన్నలగడ్డ స్నేహజ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆమె నవంబర్ 20న ‘సాక్షి’తో మాట్లాడారు.
చదవండి: Goodbye to India: ఐదేళ్లలో భారత్‌తో బంధానికి బైబై చెప్పిన 8.34 లక్షల మంది!!
తెలుగు రాష్ట్రాలకు ఒకే బ్రాంచ్ సెక్రటేరియట్
విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే విద్యార్హత పత్రాలతో పాటు జనన, వివాహ ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధం అంశాల్లో కమర్షియల్ డాక్యుమెంట్లు సైతం అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి అయితేనే ఆయా దేశాల్లో ఆ సర్టిఫికెట్ల చెల్లుబాటవుతాయి.
దరఖాస్తుదారులు సమరి్పంచే పత్రాలను పరిశీలించి, సరిచూసి అవి సరైనవే అంటూ సరి్టఫై చేయడాన్నే అటెస్టేషన్, అపోస్టిల్ అంటారు. ఇందులో భాగంగా ఆయా ధ్రువపత్రాలకు వెనక అపోస్టిల్ స్టిక్కర్‌తో పాటు స్టాంపు, సంతకం చేస్తారు.
ఈ సేవల్ని అందించడం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దేశ వ్యాప్తంగా బ్రాంచ్ సెక్రటేరియట్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించింది సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అదీనంలో ఉంది.
దరఖాస్తులను సచివాలయాల్లో సమర్పించాలి
ధ్రువీకరణ ప్రక్రియల్ని ఆర్పీఓ అధీనంలోని బ్రాంచ్ సెక్రటేరియట్ చేస్తున్నప్పటికీ.. దరఖాస్తుదారులు మాత్రం నేరుగా సంప్రదించే అవకాశం లేదు. ఆయా రాష్ట్ర సచివాలయాల్లోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో పని చేసే కౌంటర్లలోనే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి ముందు మీ సేవ, ఆన్‌లైన్ విధానాల్లో నిరీ్ణత రుసుము చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఆ విభాగం అధికారులు ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన విద్యా సంస్థ, ప్రభుత్వ విభాగం, చాంబర్లను సంప్రదించి వాటి విశ్వసనీయతను నిర్ధారించే జీఏడీ సిబ్బంది అథంటికేట్ అంటూ స్టాంప్ వేసి, సంతకం చేసి దరఖాస్తుదారుకు తిరిగి ఇస్తారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఈ పక్రియలో నూ సాధారణ, తత్కాల్ అనే విధానాలు అమలులో ఉన్నాయి. ఆపై దరఖాస్తుదారు ఎంఈఏ అదీకరణ తో పని చేసే ఏజెన్సీల ద్వారా ఈ సర్టిఫికెట్లను ఆర్పీ ఓ బ్రాంచ్ సెక్రటేరియట్‌కు పంపాల్సి ఉంటుంది.
అదే రోజు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం అదీనంలో ఉండే జీఏడీ నుంచి ఆర్పీఓలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు అదీకృత అధికారుల వివరాలను చేరతాయి. వీరి వివరాలు, సంతకాలు, స్టాంపులను ఆయా ఏజెన్సీల నుంచి వచ్చిన దరఖాస్తుదారు సర్టిఫికెట్లపై ఉన్న వాటితో సరిచూస్తారు. అన్నీ సరిపోలితే అటెస్టేషన్, అపోస్టిల్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఈ సర్టిఫికెట్ల మళ్లీ ఏజెన్సీ ద్వారానే దరఖాస్తుదారుడికి చేరతాయి. యూఏఈ, సౌదీ వంటి దేశాలు అటెస్టేషన్‌ను, హెగ్ కన్వెన్షన్‌లో ఉన్న మిగిలిన 126 దేశాలు అపోస్టిల్‌ను అంగీకరిస్తున్నాయి.
బ్రాంచ్ సెక్రటేరియేట్ అటెస్టేషన్‌ను ఉచితంగా, అపోస్టిల్‌ను ఒక్కో పత్రానికి రూ.50 చొప్పున వసూలు చేసి పూర్తి చేస్తోంది.
ఏజెన్సీ మాత్రం సరీ్వస్ చార్జీగా ఒక్కో పత్రానికి రూ.84 (స్కానింగ్ ఫీజు రూ.3 అదనం) తీసుకునేందుకు ఎంఈఏ అనుమతిచ్చింది. బ్రాంచ్ సెక్రటేరియట్ ఒకసారి చేసిన అటెస్టేషన్, అపోస్టిల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.
ఇక్కడ చదివిన విదేశీ విద్యార్థులకూ తప్పనిసరి..
కేవలం భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారికే కాదు.. ఆయా దేశాల నుంచి వచ్చిన, ఇక్కడ విద్యనభ్యసించి తిరిగి వెళ్లే వారికీ అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. అప్పుడు ఇక్కడి విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు అక్కడ చెల్లుబాటు అవుతాయి. ఎంఈఏ అధీకరణతో పని చేసే ఏజెన్సీల వివరాల కోసం వెబ్‌సైట్‌ను (www.mea.gov.in/ apostille. htm) సందర్శించాలి. అలాగే అటెస్టేషన్, అపోస్టిల్ అంశాల్లో ఇబ్బందులు ఉంటే ఈ–మెయిల్ ఐడీ(hobs.hyderabad@mea. gov.in) ద్వారా సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి నెలా 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.
– జొన్నలగడ్డ స్నేహజ, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్