KNRUHS: యూజీ ఆయుష్‌ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: యూజీ ఆయుష్‌ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబ‌ర్ 25న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
యూజీ ఆయుష్‌ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రకటన జారీ చేసింది. నీట్‌–2023 అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొంది.

అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాలని సూచించింది. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌  www.knruhs.telangana.gov.inను సందర్శించాలని పేర్కొంది. 

చదవండి: Navodaya Admission: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags