బదిలీల జీవో ఎప్పుడు?

సాక్షి, హైదరాబాద్‌: బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన జీవో కోసం ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. షెడ్యూల్, మార్గదర్శ కాలు అనధికారికంగా బయటకొచ్చినా.. జీవో వెలువడక పోవడంతో ఈ షెడ్యూల్‌ ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుందా? మార్గదర్శకాలు ఇవే ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బదిలీల జీవో ఎప్పుడు?

జనవరి 27 నుంచి ప్రక్రియ మొదలు పెడతామని ప్రకటించినప్పటికీ ఇందుకు అనుగుణంగా జీవో ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా జాగ్రత్త పడేందుకే జీవో విడుదల చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 27న జీవో ఇస్తే శని, ఆదివారాల్లో కోర్టుకెళ్లే అవకాశం ఉండదని, ఆ తర్వాత వెళ్లినా అప్పటికే ప్రక్రియ మొదలైందని కోర్టుకు చెప్పే వీలుందని అధికారులు అంటున్నారు.

చదవండి: School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు

ఇదిలావుంటే ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న షెడ్యూల్, మార్గదర్శకాలతో తమకు సంబంధం లేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన మీడియాతో అన్నారు. అయితే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే బయటకొచ్చిన మార్గదర్శకాలే జీవోలోనూ ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

చదవండి: School Education Department: బోధనా విధానంపై సర్వే

‘ఉపాధ్యాయులకు సెలవుల్లేవ్‌’

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యే వరకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సెలవులొద్దని విద్యాశాఖ ఆదేశాలిచి్చంది. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన డీఈవోల సమావేశంలో నిర్ణయించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సీసీఏ రూల్‌ 1991 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

చదవండి: Fake Notification: పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వలేదు

#Tags