School Education Department: బోధనా విధానంపై సర్వే
ఇందుకోసం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం శిక్షణ ప్రాజెక్టును అమల్లోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయక పథకం (సాల్ట్) అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి జిల్లాల అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచనలు చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి అవసరాలను అంచనా వేయడానికి వారి అవసరాల ఆధారంగా తగిన శిక్షణ అందించేందుకు ఆన్‌లైన్ సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
చదవండి: Jagananna Vidya Kanuka: ఇక మరింత మెరుగ్గా..
పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలకు సంబంధిత సమాచారం పంపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులంతా విధిగా ఆన్‌లైన్ సర్వేను పూరించాలన్నారు. అక్టోబర్ 12 నుంచి ఈ సర్వే ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభమైందని, ఇది అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా వారి సబ్జెక్టులతో సంబంధం లేకుండా 1నుంచి 10 తరగతులు బోధించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఆన్‌లైన్ సర్వే పూరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. హెచ్‌ఎంలంతా తమ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేసేలా చూడాలని కోరారు.
చదవండి: AP Government Jobs : ఏపీ విద్యాశాఖలో 679 పోస్టులు మంజూరు.. కీలక ఉత్తర్వులు జారీ