Schools Holidays News : ఆగ‌స్టు 16, 17 తేదీల్లో విద్యా సంస్థలు బంద్‌.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది ఉత్తరాదిలోనూ.. ద‌క్షిణాదిలోనూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వ‌ర్షాలతో విద్యాసంస్థ‌ల‌కు కూడా భారీగానే సెల‌వులు ఇస్తున్నారు. గ‌త నెల జూలైలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. వివిధ రాష్ట్రాల్లోని స్కూల్స్‌, కాలేజీల‌కు దాదాపు 10 రోజులు దాకా సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.
Schools and Colleges Holidays 2023

ఇప్పుడు ఆగ‌స్టులో కూడా అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గతకొద్ది రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

భారీ వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, జార్ఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ట ఐఎండీ హెచ్చరించింది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

నేడు, రేపు ఇక్క‌డ విద్యా సంస్థలకు సెల‌వులు..

భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో 55 మంది చెందారు. ఇక, వచ్చే 24 గంటల్లో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటే, ఆరెంజ్‌ అలర్ట్‌ను కూడా విధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లాలో నేడు(బుధవారం), రేపు(గురువారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు.. హిమాచల్‌ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 440 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇదే సమయంలో, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, నదులు మరియు కాలువల దగ్గరకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ అందరినీ ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రంలోని టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

☛  August School Holidays 2023 list : ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు.

వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు.

ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించిన విష‌యం తెల్సిందే. అలాగే మంగ‌ళ‌, బుధ‌, గురువారంలో కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి..
షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్‌ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులను ఆదేశించారు.  

రాకపోకలు బంద్‌..  

ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రైవేట్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది  గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్‌దామ్‌ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

తెలంగాణ‌లో 2023-24 అకడమిక్ ఇయర్‌లో ప‌రీక్ష‌లు- సెల‌వులు ఇవే..

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కూల్ అకడమిక్‌ క్యాలెండర్‌, సెల‌వుల(2023–24) పూర్తి వివ‌రాలు ఇవే..

జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌ స్కూల్ అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24ను విడుద‌ల చేశారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. 

 

ఏపీలో ఈ ఏడాది (2023-24) సెల‌వులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

#Tags