TOSS: ఓపెన్‌ పరీక్షల ఫీజుకు చివరి తేదీ ఇదే..

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్‌ 18 లోగా అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని ఓపన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎం. సోమి రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
ఓపెన్‌ పరీక్షల ఫీజుకు చివరి తేదీ ఇదే..

ప్రతి పేపర్‌కు రూ.25 అపరాధ రుసుముతో 25వ తేదీలోగా, రూ.50 అపరాధ రుసుముతో 30వ తేదీలోగా ఆన్‌ లై న్‌ ద్వారా పరీక్షల ఫీజు చెల్లించాలని సూచించారు. టెన్త్ రాయాలనుకునే వారు ప్రతి పేపర్‌కు రూ.100, ఇంటర్‌కు ప్రతి పేపర్‌కు రూ.150 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. 

#Tags