TS Gurukulam Admissions 2024 : గుడ్‌న్యూస్‌.. గురుకులాల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ ప్రవేశాలను మళ్లీ ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఈమె పేర్కొన్నారు. విద్యార్థులు జులై 12వ తేదీలోపు http://tgswadtr.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అవ‌కాశం తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల‌కు మాత్ర‌మే.

☛ July 17th Holiday 2024 : జూలై 17వ తేదీన‌ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు.. ఎందుకంటే..?

#Tags