విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకే ‘ఉన్నతి’

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమే ఉన్నతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డీఈవో ప్రణీత అన్నారు.
విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకే ‘ఉన్నతి’

జిల్లా కేంద్రంలోని విద్యార్థి బీఈడీ కళాశాలలో  ఆగ‌స్టు 29న ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘ఉన్నతి‘ హిందీ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు మరిన్ని మెలకువలు నేర్చుకొని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని సూచించారు.

కార్యక్రమంలో కేంద్ర సమన్వయకర్త ముజఫర్‌, డీఈవో సీసీ రాజేశ్వర్‌, డీఆర్పీలు వినాయక్‌, జాకీర్‌ హుస్సేన్‌, రవి జాబడే, గోమూత్‌ రెడ్డి, సుకుమార్‌ పెట్కులే, ఆయా మండలాల హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదవండి:

Orientation Programme: కామర్స్‌, బీబీఏ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

TS Intermediate: ఇంటర్ విద్యార్థుల‌కు చైర్మ‌న్ చెప్పిన కీల‌క అంశాలు

#Tags