AITUC: ‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్ వీరే
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ–1కు చెందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు.
చదవండి: Singareni Jobs: ‘జూనియర్ ఇన్‌స్పెక్టర్’ నియామకమెప్పుడో? రెండు నెలలు దాటినా..
మందమర్రి కేకే–5కు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే–5కు చెందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎస్‌ఆర్‌పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఫోర్‌మెన్ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్‌కట్టర్ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనికి చెందిన ఓవర్‌మెన్ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రూ.2.88 లక్షలు సాధించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి అక్టోబర్ 7న సీఅండ్‌ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు.