Technical Courses Exams: టెక్నికల్‌ కోర్సుల పరీక్షలు తేదీలు ఇవే..

కామారెడ్డి క్రైం: టెక్నికల్‌ కోర్సులైన డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ కోర్సులకు సంబంధించి శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఫిబ్ర‌వ‌రి 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

టెక్నికల్‌ కోర్సులకు సంబంధించి లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలను ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీఈవో రాజు ఫిబ్ర‌వ‌రి 13న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: T-Hub: 200 కోట్లతో ‘టెక్నికల్‌ హబ్‌’

డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలను ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలను ఫిబ్ర‌వ‌రి 25 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

#Tags