T-Hub: 200 కోట్లతో ‘టెక్నికల్ హబ్’
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా.. వాటిలో ఒక హబ్ ఖిలా వరంగల్ మండల పరిధి రంగశాయిపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. మంత్రి కొండా సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో టెక్నికల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి సోమవారం అంగీకారం తెలిపింది. ఈ టెక్నికల్ సెంటర్ భవన నిర్మాణం, ప్లాంట్, యంత్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. నగరంలో స్థాపించనున్న ఈ సెంటర్‌ను విశేషమైన సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పంచింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధునాతన సాంకేతికకను సమకూర్చడం, నైపుణ్యం కలిగిన మానవ పనరుల సృష్టి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వ్యాపార సలహాలు అందించడం వంటి అంశాల్లో ఈ టెక్నికల్ సెంటర్ ప్రధాన పాత్ర పోషించనుంది. పలు రకాల పరిశ్రమలకు అవసరమైన సేవలను అనుసరించి టెక్నికల్ సెంటర్ శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. నిర్మాణ, ఎలక్ట్రికల్, ఫౌండ్రీ లెదర్, గ్లాస్, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాలు టెక్నికల్ సెంటర్లు సేవలను అందిస్తాయి. టక్నికల్ సెంటర్ ఏర్పాటు వరంగల్ జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే హబ్ ఏర్పాటు ప్రకటనతో వరంగల్ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుదలతో వరంగల్ టెక్నికల్ సెంటర్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన మంత్రి సురేఖను ప్రజలు అభినందనలు తెలిపారు.
చదవండి: Engineering Careers