రాష్ట్రంలో 53 గురుకుల డిగ్రీ కాలేజీలు

రాష్ట్రంలో 53 గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి. ఇం దులో ఎస్సీ గురుకుల సొసైటీకి 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీకి 22 డిగ్రీ కాలేజీలను మం జూరు చేయగా వాటిని ప్రాధాన్యత క్రమంలో సం బంధిత సొసైటీలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నా యి.
రాష్ట్రంలో 53 గురుకుల డిగ్రీ కాలేజీలు

మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధి లో ఒకే ఒక్క మహిళా డిగ్రీ కాలేజీ గజ్వేల్‌లో ఉంది. ఈ కాలేజీలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఇంటర్‌ వరకు గురుకుల విద్యతో ముందుకెళ్లిన బీసీ విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లే సాహసం చేయలేకపో తున్నారు. బీసీల నుంచి గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటు కోసం విపరీతమైన డిమాండ్‌ ఉంది. బీసీ సంక్షేమ శాఖ, గురుకుల సొసైటీపై ఒత్తిడి పెరగడం తో ప్రతి జిల్లా కేంద్రంలో ఓ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ప్రభుత్వానికి రెండుసార్లు ప్రతిపాదనలు పంపింది. కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రంలోనైనా ఒక్కో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మూడోసారి ప్రతిపాదనలు పంపినా స్పందన లేదు.

తక్షణ చర్యలు చేపడితే..

కొత్తగా గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే 2022–23 విద్యా సంవత్సరంలో వాటిని ప్రారంభించే వీలుంటుంది. కొత్త విద్యా సంవత్సరానికి 3 నెలల ముందు ప్రభుత్వం అనుమతి లభిస్తేనే భవనాల లభ్యత, కాలేజీ ఏర్పా టు, మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాల మాదిరి కాకుండా పక్కా ఏర్పాట్లు ఉంటేనే కాలేజీ నిర్వహణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే ఆగస్టు నాటికి కాలేజీలను ప్రాథమికంగా ఏర్పాటు చేసే వీలుంటుందని అంటున్నారు.

#Tags